న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని రెండవ అతి పెద్ద నగరమైన ఖర్కీవ్‌పై రష్యా సైనిక దాడి ఉధృతం అవుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులందరూ నగరాన్ని విడిచి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇండియన్ ఎంబసీ బుధవారం హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు తూర్పున ఉన్న ఖర్కీవ్ నగరంలోని నివసిస్తున్న భారతీయులందరూ తక్షణమే నగరాన్ని విడిచిపెట్టి బుధవారం సాయంత్రం 6 గంటల కల్లా పెసోచిన్, బబాయి లేదా బెజ్‌లియుదోవ్‌కా చేరుకోవాలని భారతీయ ఎంబసీ కోరింది. అయితే, ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో భారతీయ ఎంబసీ నుంచి ఈ హెచ్చరిక రావడం ఖర్కీవ్‌లోని భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. ఖర్కీవ్ రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఎక్కకుండా తమను అడ్డుకుంటున్నారని పలువురు భారతీయ విద్యార్థులు మీడియాకు తెలిపారు. రష్యన్ సేనల దాడుల్లో ఖర్కీవ్‌లో భారతీయ వైద్య విద్యార్థి నవీన్ మరణించిన విషయం తెలిసిందే.
MEA Says Indians to leave Kharkiv