Thursday, December 26, 2024

విదేశీ ఉద్యోగాల వేటలో సంస్థల మూలాలపై తనిఖీ అవసరం

- Advertisement -
- Advertisement -

MEA Suggestion for Jobseeking Indians

ఉద్యోగార్థులైన భారతీయులకు ఎంఇఎ సూచన

న్యూఢిల్లీ : విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఆయా సంస్థల యాజమాన్యాల ఉనికి, ఆధారాలు, రిక్రూటింగ్ ఏజెంట్ల పూర్వాపరాలు తదితర వాస్తవాలపై జాగ్రత్తగా తనిఖీ చేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎం ఇ ఎ ) శనివారం హెచ్చరించింది. ఇటీవల మయన్మార్‌లో మైవాడ్డీ ప్రాంతంలో ఉద్యోగాల స్కామ్‌లో ఇరుక్కున్న 30 మంది భారతీయులను భారత దౌత్యకార్యాలయం రక్షించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ హెచ్చరించింది. థాయ్‌లాండ్‌లో నకిలీ ఉద్యోగాల రాకెట్లు కొన్ని బూటకపు ఐటి సంస్థల ద్వారా డిజిటల్ సేల్స్, మార్కెటింగ్ ఏజెంట్ల ఉద్యోగాల పేరుతో భారతీయ యువకులను ఊరుస్తున్నాయని ఎం ఇ ఎ ఉదహరించింది. ఈమేరకు కాల్‌సెంటర్ స్కామ్, క్రిప్టోకరెన్సీ మోసాలతో ఆయా సంస్థలకు ప్రమేయం ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.

ఐటి నైపుణ్యం కలిగిన యువకులను లక్షంగా చేసుకుని డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో దుబాయ్, భారత్ కేంద్ర ఏజెంట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తున్నారని వివరించింది. బాధితులను సరిహద్దుల ద్వారా అక్రమంగా ఎక్కువగా మయన్మార్‌కు తరలిస్తున్నారని, అక్కడ కఠినమైన పరిస్థితుల్లో వారిని బందీలను చేసి పనిచేయిస్తున్నారని విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఉద్యోగాల కోసం టూరిస్టు, లేదా విజిట్ వీసాలతో అభ్యర్థులు ప్రయాణించే ముందు ఆయా విదేశీ యాజమన్యా సంస్థలు ఎంతవరకు నమ్మదగినవో సంబంధిత దౌత్య కార్యాలయాల ద్వారా పరిశీలించుకోవాలని సూచించింది. ఆగ్నేయ మయన్మార్ కయిన్ రాష్ట్రంలో గల మైవాడ్డీ ప్రాంతం థాయ్‌లాండ్ సరిహద్దుల్లో ఉంది. మయన్మార్ ప్రభుత్వ పూర్తి నియంత్రణలో ఈ ప్రాంతం లేదు. ప్రత్యేక నిర్దిష్ట జాతుల సాయుధ బలగాల అధీనంలో మైవాడ్డీ ప్రాంతం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News