Monday, January 20, 2025

నాలుగు స్టేషన్‌లలో తక్కువ ధరకే భోజనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే తక్కువ ధరకే భోజనం, త్రాగునీటిని అందించే సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. మొత్తం నాలుగు స్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. ఆయా స్టేషన్లలో రూ.20లు, రూ.50లకే నాణ్యమైన ఆహారం లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణకుమార్ జైన్ తెలిపారు. జనరల్ బోగీల్లోని ప్రయాణికులకు చేరువగా చౌక ధరలకే భోజనం, త్రాగునీటిని అందించనున్నట్లు రైల్వే శాఖ ఇటీవల వెల్లడించింది. సాధారణ బోగీలు ఆగే చోట ఈ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు వాటిని అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.

తొలుత కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, ఆరునెలల అనంతరం ప్రయాణికుల డిమాండ్ మేరకు మిగతా చోట్లకు దీనిని విస్తరిస్తామని ఆయన వివరించారు. ఐఆర్‌సిటిసి చెందిన కిచెన్ యూనిట్లు, జన్ ఆహార్ కేంద్రాలు ఈ ఆహారాన్ని సరఫరా చేస్తాయని ఆయన తెలిపారు. ఇందులో భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో 7 పూరీలతో పాటు ఆలు కూర, పచ్చడిని రూ.20లకు అందిస్తుండగా, రెండో కేటగిరీలో అన్నం, కిచిడీ, ఛోలే కుల్చే, ఛోలే-భటూరే, పావ్ భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని ఎంచుకోవచ్చని ఆయన తెలిపారు. దీని ధరను రూ.50లుగా నిర్ణయించారు. అలాగే 200 మిల్లీ లీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ గ్లాసులను సైతం ఆయా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు. ఇక తూర్పు కోస్తా రైల్వే పరిధిలో జార్కీ, జార్సుగుడ, ఖుర్దా రోడ్డు స్టేషన్లలో ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News