Monday, December 23, 2024

కొలువుదీరిన మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి రెండు కండ్లు అని రాజ్యసభ సభ్యుడు బ డుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం మిర్యాలగూడ మ ండలం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డుల జరిగిన మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేనివిధంగా రైతులకు 24 గంటల విద్యుత్, పంట పెట్టుబడి కోసం రైతుబంధు, రైతుభీమా పథకాలతోపాటు సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేసే బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండదండగా ఉండి, రాబోయే ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ను, మిర్యాలగూడ ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కర్‌రావును ఆదరించి అఖండ విజయం అ ందించి, హ్యాట్రిక్ సా ధించాలన్నారు.

గొర్రెల కాపరినైనా తనను రా జ్యసభ సభ్యుడిగా, దళిత కుటుంబంలో పుట్టి, ఎకరం భూమి ఉన్నటువంటి బైరం బుచ్చయ్యను మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చేసిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. పది రోజులపాటు తెలంగాణ విద్యుత్‌పై ప్రజల్లోకి వెళ్లాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి శాసనమండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డిసిఎంఎస్ వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి జడ్‌పి కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ మోసిన్ అలీ, మిర్యాలగూడ ఆర్డీఓ బి. చెన్నయ్య, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మరళ్ల చంద్రారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ ఛైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, డైరెక్టర్లు ధీరావత్ భిక్షానాయక్, కట్టెబోయిన పాపారావు, చిలుకల విద్యాసాగర్, మన్నెం విజయలక్ష్మి, గుర్రం శ్రీనివాసరెడ్డి, పత్తిపాటి నవాబ్, చలికంటి యాదగిరి, బండి వెంకటేశ్వర్లు, నేనావత్ బాలునాయక్,నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News