Wednesday, January 22, 2025

మెరుగైన మురుగు నీటి నిర్వహణకు చర్యలు

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి

కీసర: నాగారం మున్సిపాలిటీ పరిధిలో మురుగు నీటి నిర్వహణను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం 9వ వార్డు విష్ణుపురి కాలనీలో రూ.6.50 లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టిన భూగర్బ మురుగు కాలువ నిర్మాణ పనులను ఛైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ప్రాధాన్యత క్రమం లో మురుగు నీటి నిర్వహణ కోసం భూగర్భ మురుగు కాలువల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. ఈ మేరకు అవసరమైన నిధులు కేటాయి స్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ కొమిరెళ్లి అనిత సుధాకర్‌రెడ్డి, విష్ణుపురి కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News