Wednesday, January 22, 2025

మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు

- Advertisement -
- Advertisement -
  • దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్‌గౌడ్

కీసర: మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్‌గౌడ్ అన్నారు.

సోమవారం కుషాయిగూడ నాగార్జున కాలనీలోని సన్‌సీడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ కార్మికులకు, సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఛైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల సహకారంతో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది సౌకర్యార్ధం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సన్ సీడ్ హాస్పిటల్ చైర్మన్ డా.అన్వేష్ మాట్లాడుతూ సన్ సీడ్ హాస్పిటల్‌లో తక్కువ ఖర్చులతో అన్ని రకాల వైద్య సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయని అన్నారు.

కార్మికులకు, పేదలకు 30 శాతం రాయితీతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.స్వామి, మేనేజర్ వెంకటేశం, సన్‌సీడ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బానుచందర్, సీఈవో కె.రాములు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News