Monday, December 23, 2024

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టి వ్యాధులను నివారించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ వసంత అధ్యక్షతన సీజనల్ వ్యాధుల ని వారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా జడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం, ఆరోగ్యం సిఎం కెసిఆర్ అభిమతం అని, ఈ వర్షాకాలంలో పల్లెలను శుభ్రంగా ఉంచి వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో వర్షపు నీరు, మురుగు నీరు, నిలువకుండా చూడాలని, దోమలు, వృద్ది చెందితే మలేరియా డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు.

ఈగ లు, దోమల వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షపునీరు, మురుగు నీరు పరిసరాల్లో నిలవకుండా ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వర్షాకాలంలో మొక్కలను విరివిగా నాటాలని, ఇదివరకు నాటిన చైనా బాదం మొక్కల స్థానంలో కానుగ, వేప మొక్కలు నాటాలన్నారు.

డిపిఓ, డిఎల్‌పిఓలు, ఎంపిఓలు తర చుగా గ్రామాలను సందర్శించి పల్లె ప్రగతి కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలను, మంకి ఫుడ్ కోర్టుల ను సందర్శించి ప్రభుత్వం ఏ లక్షంతో ఏర్పాటు చేసిందో, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో దోమల నివారణకు వీధుల్లో ఫాగింగ్ చేయడంతో పాటు మురుగు కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ ఎప్పటికప్పుడు చల్లుకోవాలన్నారు.

విష జ్వరాలు అంటు వ్యాధులు ప్రబల కుండా గ్రామ పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. వర్షాకాలంలో మంచినీరు కలుషితం అయ్యే అవకాశం ఉంటుందని, కాచి వడబోసిన నీటిని తాగేలా ప్రజలకు ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు, అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లోని ఓవర్‌హె డ్ ట్యాంకులను నెలలో మూడుసార్లు విధిగా శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్‌ను మోతాదు మించకుండా కలిపి సరఫరా చేసేలా సిబ్బందిని ఆదేశించాలన్నారు.

మిషన్ భగీరథ పైపులైన్‌లు పగిలిపోయి తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు మిషన్ భగీరథ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరుగకుండా, నీరు నిలువకుండా ప్రతి శనివారం శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వర్షాకాలంలో గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలను జిల్లా పరిషత్‌కు నివేదించాలని చైర్ పర్సన్ వసంత ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్‌పిసిఇఓ రామానుజాచారి, డిపిఓ దేవరాజ్, డిఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ శ్రీధర్, జిల్లా మలేరియా అధికారి శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు, ఎంపిఓలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News