Sunday, December 22, 2024

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా నిశితంగా పర్యవేక్షించాలి
మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం మిషన్ భగీరథ శాఖలోని చీఫ్ ఇంజనీర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని ఇంజనీర్లను కోరారు.

అనంతరం  మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. త్వరలో మేడారం జాతరపై లైన్ డిపార్ట్‌మెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రిజర్వాయర్లు, నదుల తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. భగీరథ ప్రాముఖ్యతపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని సీఈలు, ఎస్‌ఈలకు సూచించారు.మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి పూర్తిస్థాయిలో ముఖ్య కార్యదర్శి స్మిత సభర్వాల్ మంత్రికి వివరించారు. సమీక్షా సమావేశంలో మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితోపాటు అన్ని మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News