Thursday, January 16, 2025

విజిల్స్ రూబెల్ల వ్యాధి అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి : కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మెదక్ ప్రతినిధిః మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా ఆద్వర్యంలో మంగళవారం విజిల్స్ రూబెల్లా సీజనల్ వ్యాధిపై అవగాహన తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరం, చర్మంపై దద్దుర్లు ఉన్నవారిని గుర్తించి చికిత్స నిమిత్తం శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపాలని సూచించారు. ఈ వ్యాధి వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చని అన్నారు. ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు 0.5 సంవత్సరాల పిల్లలకు 9 నుంచి 12 నెలల వయస్సు ఎంఆర్ విజిల్స్ రూపంలో వ్యాక్సిన్ మొదటిడోస్16 నుంచి 24 నెలల మద్య ఎంఆర్ రెండవ డోస్ తీసుకోవాలని ఆయన అన్నారు.

వ్యాధి గర్బిణీ స్త్రీలకు సోకే ప్రమాదకరం ఎందుకంటే వారి శిశువులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందన్నారు. మన జిల్లాలో ఇప్పటివరకు పిల్లల్లో 9 కేసులను గుర్తించడం జరిగిందని అందులో ఐదు కేసులు పాజిటివ్‌గా రావడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా వైద్యాదికారి చందు నాయక్, జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా డీఐఓ డాక్టర్ మాధురి, డబ్లుహెచ్‌ఓ కన్సల్‌టెంట్ డాక్టర్ మురారి, జిల్లా వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News