Monday, January 27, 2025

గోవుల అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు

- Advertisement -
- Advertisement -

నారాయణపేట : రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నారాయణపేట జిల్లాలో గోవుల అక్రమ రవాణా, గోవుల వదను నియంత్రించడానికి, కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణలోకి గోవుల అక్రమ రవాణాను నియంత్రించడానికి నారాయణపేట జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని వెటర్నరీ వైద్యులు డా. శ్రీనివాసు, డా. అనిరుద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డిఎస్పీ కె. సత్యనారాయణలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆ దేశాల మేరకు గోవుల అక్రమ రవాణా, గోవుల వదను నియంత్రించడానికి, కర్ణాటక నుండి తెలంగాణలోకి గోవులను అక్రమంగా రవాణా చేయకుండా జిల్లా పరిధిలో ఈ నెల25వ తేదీనుండి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా గోవులను రవాణా చేయాలనుకుంటే సంబంధిత వె టర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలని లేనియెడల వారీపై కౌస్ ఆక్ట్ ప్రకారం చట్టపరమైన చ ర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎస్‌బి సిఐ రాంలాల్, ఆర్‌ఐ కృష్ణయ్య ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News