Sunday, December 22, 2024

ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందేలా చర్యలు

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ బదావత్ సంతోష్

మంచిర్యాల ప్రతినిధి: బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలో భాగంగా 5వ సారి చేపడుతున్న కార్యక్రమంలో జిల్లాలోని అర్హత గల ప్రతి మహిళకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ది అధికారి శేషాద్రి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు రాములు, సురేష్‌లతో కలిసి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను జిల్లాలోని ప్రతి మహిళకు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.

అక్టోబరు 4 తేదీ వరకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, చీరలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత పరిధిలోని చౌకధరల దుకాణాలకు పంపించడం జరుగుతుందని, మహిళలకు చీరలు పంపిణీ చేసి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పంపిణీ వివరాలను నివేదిక అందించాలన్నారు. జిల్లాలోని 16 మండలాలు, 7 మున్సిపాలిటీలలో 2 లక్షల 84 వేల 940 మహిళలు ఉండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీకి చర్యలు చేపట్టాలని, ఇప్పటి వరకు 2 లక్షల 14 వేల చీరలు వచ్చాయని, మిగతావి 3 రోజుల్లో అందించడం జరుగుతుందని, చీరల నిల్వ, పంపిణీ వివరాలలో ఎలాంటి విభేదాలు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు.

ఈ క్రమంలో చౌకధరల దుకాణాల డీలర్లకు తగు సూచనలు చేయాలని, తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలని, ప్రతి రోజు నివేదిక అందించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News