Monday, December 23, 2024

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర వైద్య అరోగ్య,ఆర్ధిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు

చర్లపల్లి: రాష్ట్రంలో ప్రజా అరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య అరోగ్య,ఆర్ధిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు అన్నారు. చర్లపల్లి డివిజన్ నాగర్జున్‌నగర్‌కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సన్‌సీడ్ మల్టీస్పెషల్టి ఆసుపత్రిని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపి బిబిపాటిల్, బిఅర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లకా్ష్మరెడ్డిలతో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధునిక వైద్య సేవలు అందించడంలో మల్టీస్పెషల్టి ఆసుపత్రులు ముందుంటున్నయని మెరుగైన వైద్యసేవలు అందించి ప్రజల అభిమానాన్ని చురగొనలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు.

ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునిక వైద్యపరికరాలను వారు పరిశీలించారు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అన్వేష్ మంత్రి ఎమ్మెల్యేలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ నాయకులు ప్రారంభోత్సవానికి వచ్చి కుషాయిగూడ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఆసుపత్రి ఏర్పాటు చేసినందుకు డాక్టర్ అన్వేష్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి, మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవియాదవ్, జేరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ పజ్జురి పావణిరెడ్డి వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News