Wednesday, January 22, 2025

జీడిమెట్లలో నోట్లో గుడ్డలు కుక్కి మెకానిక్ హత్య

- Advertisement -
- Advertisement -

Mechanic murder in Medchal dist

 

మేడ్చల్: మెకానిక్ నోట్లో గుడ్డలు కుక్కి రాడ్లతో కొట్టి చంపిన సంఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీరేందర్ కుమార్ అనే వ్యక్తి గణేష్ నగర్‌లో జెఎస్‌పి హోండా షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. బీరేందర్ చింతల్‌లోని కల్పన సోసైటీలో నివసిస్తున్నాడు. గుర్తు తెలియన వ్యక్తులు బీరేందర్ నోట్లో గుడ్డలు నొక్కి రాడ్లతో కొట్టి హత్య చేశారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News