Thursday, September 19, 2024

దీపావళి కానుకగా ‘మెకానిక్ రాకీ’

- Advertisement -
- Advertisement -

హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీలో ’మెకానిక్ రాకీ’గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. హై బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

మెకానిక్ రాకీ చిత్రాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ గన్, రెంచ్‌ను పట్టుకుని కనిపించారు. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News