Sunday, December 22, 2024

మెదక్ లో యువతి హత్య… మృతదేహాన్ని కాల్చేసి రోడ్డు పక్కన పడేశారు…

- Advertisement -
- Advertisement -

మెదక్: యువతిని హత్య చేసి రోడ్డు పక్కన పడేసి మృతదేహాన్ని కాల్చేసిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లే దారిలో వడియారం గ్రామ శివారులో గుర్తు తెలియన యువతి మృతదేహం సగం కాలిపోవగంతో వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్యనారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతిరాలి ఒంటిపై కాషాయ రంగు టాప్, ఎరుపు లెగ్గిన్ ఉందని తెలిపారు. మృతురాలు ఎవరో తెలిస్తే నిందితులను పట్టుకోగలమని పోలీసులు పేర్కొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో అదృశ్యమైన యువతుల వివరాలు తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News