Friday, November 15, 2024

జమునా హ్యాచ‌రీస్ భూక‌బ్జా నిజమే: మెదక్ క‌లెక్ట‌ర్

- Advertisement -
- Advertisement -

మెద‌క్: రాష్ట్ర మాజీ మంత్రి, హుజూరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ కుటుంబానికి చెందిన జమునా హ్యాచ‌రీస్ భూక‌బ్జాకు పాల్పడింది నిజమేనని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రీశ్ స్ప‌ష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం భూకబ్జా అంశంపై క‌లెక్ట‌ర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”మొత్తం 70.33 ఎక‌రాల అసైన్డ్ భూముల‌ను జ‌మునా హ్యాచ‌రీస్ క‌బ్జా చేసిందని రెవెన్యూ అధికారుల స‌ర్వేలో తేలింది. మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌, హ‌కీంపేట్ ప‌రిధిలో 56 మంది అసైనీల భూముల‌ను క‌బ్జా చేసి వ్య‌వ‌సాయేత‌ర అవ‌స‌రాల‌కు వాడుతున్నారు. నిషేధిత జాబితాలోని భూముల‌ను రిజిస్ట్రేష‌న్ చేసుకుని అనుమ‌తులు లేకుండానే పెద్ద పెద్ద షెడ్లు నిర్మించారు. వాల్టా చ‌ట్టాన్ని ఉల్లంఘించి అట‌వీ ప్రాంతంలో చెట్లు న‌రికి, రోడ్డు వేశారు. పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెద‌జ‌ల్లుతున్న‌ట్లు గుర్తించాం. అసైన్డ్ భూముల క‌బ్జా, అక్ర‌మ నిర్మాణాల‌పై ప్ర‌భుత్వానికి నివేదిక పంపాం. అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపై, అందుకు స‌హ‌క‌రించిన అధికారుల‌పై చ‌ట్టప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటాం. బాధిత అసైనీల‌కు న్యాయం చేసేలా ప్ర‌భుత్వానికి నివేదిక పంపాం” అని క‌లెక్ట‌ర్ హ‌రీశ్ తెలిపారు.

Medak Collector press meet over Etela Land Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News