Friday, December 20, 2024

మెదక్ లో తల్లిని చంపిన కుమారుడు… ఎందుకు చంపాడో తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెదక్ జిల్లా నిజాంపేటలో దారుణం వెలుగులోకి వచ్చింది. పెన్షన్ డబ్బుల కోసం తల్లి దుర్గవ్వను(58) కుమారుడు రామచంద్రం హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తన తల్లి దుర్గవ్వతో కలిసి కుమారుడు రామచంద్రం ఉంటున్నాడు. పెన్షన్ డబ్బులు ఇవ్వాలని పలుమార్లు తల్లిని కుమారుడు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో దుర్గవ్వను అతడు చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు రామచంద్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News