- పోలీస్టేషన్‌లో ఫిర్యాదు
రేగోడు: మెదక్ జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు సుంకే రమేష్ ఆయన అనుచరులతో ఒక వృద్ధురాలిపై నిర్ధాక్షణంగా దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా రేగోడు మండల పరిధిలోని ఆర్ ఇటిక్యాల గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అధికార పార్టీ బిఆర్‌యస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గ్రామ సర్పంచ్ సుంకే రమేష్ కి నేను పలు సందర్భాలలో సమస్యలపై నిలదీశానని అలాగే తనకు బాత్రూం కట్టనీయలేదని తన ఇంటి వైపు సిసి రోడ్డు కూడా వేనీయకుండా చూశాడని, దీంతో నేను ఒక ఆగ్రహనికి లోనై సర్పంచ్ కు పోన్ చేసి నువ్వు అభివృద్ధి చేయాల్సింది పోయి నువ్వే అడ్డుకుంటే ఎలా అని ఫోన్ ద్వారా నేను ఆయనతో మాట్లాడి నాకు వ్యక్తిగత విషయాలలో అడ్డు వస్తు కోర్టులో కేసులు కూడా వేయించడన్న కోపం తో నేను దురుసుగా ప్రవర్తించి కోపంతో నేను తిట్టానని అది మనసులో పెట్టుకొని పంచాయతీ ఉంది రావాలని సూచించాడు.
నేను వెళ్లగా నన్ను గ్రామ సర్పంచ్ 50 మందితో వచ్చి నన్ను కొట్టగా ఈ విషయం తెలుసుకున్న మా అమ్మ మచుకురు యాదమ్మ కొట్టకుండి మీ కాలు మోక్త అని వేసుకున్న వినకుండా సర్పంచు కడుపులో తన్నుతు ఒక వృద్ధురాలు అన్న విషయం మరచి పోయి విచిక్షణంగా మా అమ్మను నన్ను కొట్టారని బాధితుడు మచుకురి దత్తు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అధికార బలంతో కేసు కాకుండాచూస్తున్నారని నన్ను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వారన్నారు.
తను పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని వారన్నారు. పై విషయమై గ్రామ సర్పంచ్ సుంకే రమేష్‌ను వివరణ కోరగా నన్ను ఫోన్‌లో అన్ పార్లమెంటరీ వాట్స్ వాడారని నేను గ్రామపంచాయతీ వద్దకు పిలుపు ఇవ్వగా పెద్దల సమక్షంలో ఒక మెదక్ జిల్లా సర్పంచ్ల ఉపాధ్యక్షుడు అయిన నన్ను గల్ల పట్టి తోసివేసారని వారన్నారు.