Thursday, January 23, 2025

దిష్టి తీసి బయట పడేసినందుకు…. కొట్టి చంపారు

- Advertisement -
- Advertisement -

మెదక్: గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి దిష్టి తీసి మూడు బాటల వద్ద వస్తువులను పడేయడంతో గ్రామస్థులు గమనించి ఇద్దరు మహిళలు, వ్యక్తిని చితకబాదారు. దీంతో అనారోగ్యానికి గురైన వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా టెక్మాల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మందాపూర్ గ్రామానికి చెందిన దేవునికాడి రాములు(65), నవపేటకు చెందిన వెంకట లక్ష్మిని వివాహం చేసుకొని ఇల్లరికం వచ్చాడు. ఒగ్గుకథలు చెబుతూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. బాచుపల్లికి చెందిన బాలమణిని తీసుకొని గొల్లగూడెంలోని మేనకోడలు గంగమ్మ ఇంటికి వచ్చారు. రాములుకు విరేచనాలు కావడంతో టేక్మాల్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో మళ్లీ గొల్లగూడానికి తీసుకొచ్చారు. మంగళవారం రాములకు దిష్టి తీసి మూడు బాటల వద్ద ఆ వస్తువులను పడేశారు. గ్రామస్థులు గమనించి చేతబడి చేశారనే అనుమానంతో ముగ్గురిని బయటకు లాక్కొంచి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడడంతో ముగ్గురు నడుచుకుంటూ గ్రామ శివారులోకి వచ్చారు. వారిని వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాములు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. రాములు కుమారుడు శివ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News