- Advertisement -
మెదక్: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రేణుక అనే మహిళకు భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్‌లోని ఫతేనగర్‌లో ఉంటుంది. ఇంటి పక్కన ఉండే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం పిల్లలకు తెలియడంతో తల్లిని మందలించాడు. వెంటనే ప్రియుడ్ని ప్రియురాలు దూరం పెట్టడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. రేణుకను హత్య చేసిన అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఫిబ్రవరి 6 నుంచి తల్లి కనిపించకపోవడంతో రేణుక కుమారుడు శ్రీనాథ్ మెదక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె ఫోన్ కాల్స్ పరిశీలించారు. చివరి కాల్ ప్రియుడిదిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -