Friday, November 22, 2024

మెదక్ ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాన్ని ఇబ్బందులు లేని భవనంలోకి మార్చాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షిషా

మెదక్: ప్రస్తుతం మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని అన్ని సౌకర్యాలు ఉండే మరో భవనంలోకి మార్చాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్షం చేయరాదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జిల్లా ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా డయాలసిస్ కేంద్రాన్ని పూర్తిగా పరిశీలించి ఇబ్బందులు ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అందుకుగాను పక్కనే ఉన్న మరో భవనంలోకి మార్చాల్సిందిగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌కు కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేసుకొంటున్న పెషేంట్లకు వైద్యం అందుతున్న తీరును స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే డయాలసిస్ కేంద్రంలో ఎంత మంది వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారి సమయాలను తదితర వివరాలు అక్కడేఉన్న సిబ్బందితో స్వయంగా మాట్లాడారు. అనంతరం డయాలసిస్ కేంద్రంలో చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. వర్షాలను దృష్టిలోఉంచుకొని వెంటనే ప్రస్తుతం ఉన్న కేంద్రంలో నుంచి పక్కన ఉన్న భవనంలోకి మార్చాల్సిందింగా ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్షం వహించరాదని కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News