Sunday, December 22, 2024

తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

మెదక్: తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దొంత లలిత(72) అనే వృద్ధురాలు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. అదే రోజు ఆమె అంత్యక్రియులు కౌడిపల్లిలో జరిగాయి. మృతురాలి కుమారుడు దొంత నరేందర్(45) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో ఇంట్లో చనిపోయాడు. రెండు రోజుల వ్యవధిలో ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గతంలో నరేందర్ సోదరులలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రికి మతిస్థిమితం లేక కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు. నరేందర్ భార్య లక్ష్మి, కుమారుడు కూతురు, ఇద్దరు అక్కలు, చెల్లెలు ఉన్నారు. కౌడిపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News