హైదరాబాద్: మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటే ఇల్లు, సమాజం , రాష్ట్రం, దేశం ఆరోగ్యవంతంగా ఉంటుందనిమెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సౌభాగ్యం అనే నినాదంతో మహిళల కోసం బృహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్నారు… ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తాం కాబట్టి ఎంత సంపాదించినా ఎంత విజ్ఞానాన్ని కూడబెట్టిన పిల్లలకు ఇచ్చే ఆరోగ్యం సరిగా లేకపోతే ప్రతి ఒక్కరి ఆర్థిక స్తోమత కోల్పోతుందన్నారు.
మహిళలు గర్భిణీ స్త్రీలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా దీనిలో 53 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అనారోగ్య సమస్యలు ఉంటే వారు ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షలు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశం అన్నారు. ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడితే ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పడుతుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్లను, నర్సులను ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేష్ కలిసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్ నాయక్ ,మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, జిల్లా సూపర్డెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, నర్వ లక్ష్మీనారాయణ గౌడ్, కిషోర్, వసంత్ రాజ్, కో ఆప్షన్ నెంబర్లు పాలిన్ రత్న కిరణ్, సయ్యద్ ఉమర్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ పురం, వెంకటనారాయణ, నాయకులు రాగి. అశోక్, లింగారెడ్డి, శివరామకృష్ణ, శంకర్, సాంసన్, సందీప్, తదితరులు ఉన్నారు.