Monday, December 23, 2024

బంగారు బోనం ఎత్తిన మెదక్ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మెదక్ టౌన్: ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రాంగణంలో బోనాల పండగ అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సంవత్సరం మంగళవారం తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బంగారు మైసమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరపున బంగారం బోనంను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమర్పించారు. బోనాల పండగ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, మంత్రిజగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్యే మండలి సభ్యులు, శాసనసభ కార్యదర్శి నర్సింహచారి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News