Tuesday, November 5, 2024

రూ.5.22కోట్ల దుర్వినియోగంపై.. మెదక్ ఎస్‌బిఐ అధికారిని అరెస్టు చేసిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

Medak SBI officer arrested by CBI

న్యూఢిల్లీ: మెదక్‌లోని నర్సాపూర్ బ్రాంచ్ ఎస్‌బిఐ అధికారిని సిబిఐ అరెస్టు చేసింది. రూ.5.22కోట్ల నగదు దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై ఎస్‌బిఐ క్యాష్ ఇన్‌చార్జ్‌ను అరెస్టు చేశారని తెలంగాణ అధికారులు సోమవారం తెలిపారు. బ్యాంక్ ఎజిఎం నాగేందర్ ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. నిందితుడు బ్యాంకులోని రూ.2.32కోట్ల నగదు, రూ.72లక్షల విలువచేసే బంగారం, మూడు ఏటిఎంలకు సంబంధించిన నగదు రూ.2.19కోట్లుతోసహా మొత్తం రూ.5.22కోట్లు దుర్వినియోగం చేశాడని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో సోదాలు చేసిన సిబిఐ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక ముందు అధికారులు హాజరుపరచగా ఈనెల 17వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారని సిబిఐ ప్రకటనలో తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News