Thursday, January 9, 2025

అక్రమ సంబంధం… మర్మాంగాలు, శరీరంపై వాతలు పెట్టి…

- Advertisement -
- Advertisement -

మెదక్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడి శరీరం, మర్మాంగాలపై వాతలు పెట్టి చిత్ర హింసలకు గురి చేసిన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాంతం మనోహరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లింగారెడ్డి పేటలో నారాయణ, సాయి, జితేందర్ అనే ముగ్గురు యువకులు స్నేహితులుగా ఉన్నారు. సాయి, జితేందర్, మరో వ్యక్తి ఆదివారం మద్యం సేవిస్తుండగా నారాయణకు రమ్మని కబురు పంపారు. నలుగురు మద్యం పీకలదాకా తాగిన తరువాత నారాయణను విద్యుత్ తీగలతో కటేసి శరీరం, మర్మాంగాలు, నాలుకపై వాతల పెట్టి హింసించడంతో పాటు దాడి చేశారు. వారి నుంచి నారాయణ తప్పించుకొని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వెంటనే అతడిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓ మహిళతో నారాయణ వివాహేర సంబంధం పెట్టుకోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లేలా చేశాడని కోపంతో అతడిపై దాడి చేశారని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పెద్దల సమ్మతితోనే ప్రేమ పెళ్లిళ్లపై అధ్యయనం చేస్తాం: గుజరాత్ సిఎం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News