Monday, December 23, 2024

మెదక్ జిల్లా ప్రజా పరిషత్ పనుల స్థాయి సమావేశం

- Advertisement -
- Advertisement -

మెదక్: జడ్పీ చైర్‌పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మెదక్ జిల్లా ప్రజా పరిషత్ పనుల స్థాయి సంఘం సమావేశాలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు శాఖల పనితీరుపై సమీక్ష చేసిన ఎమ్మెల్సీ ఆ సంబంధిత శాఖల అధికారులకు సూచనలు తెలిపారు. రహదారులు, భవనాలశాఖకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహించి ఆ శాఖ అధికారులకు ఎమ్మెల్సీ పలు సూచనలు చేశారు. రామాయంపేట పట్టణంలో రోడ్డు నిర్మాణం చేసి డివైడర్ వర్క్‌ను పెండింగ్‌లో ఉంచారని ఆ శాఖ అధికారులపై ఎమ్మెల్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజాంపేట మండల పరిధిలో రహదారి నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న కల్వర్టులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ సూచించారు.

పెండింగ్‌లో ఉన్న పనులను టార్గెట్ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్సీ తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ శాఖపై సమీక్ష చేస్తూ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పనులు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆ శాఖ ఇంజనీర్లకు ఎమ్మెల్సీ సూచించారు. శంకరంపేట(ఆర్) మండల కేంద్రంలో పాత ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకును కూల్చి ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా నీటి సమస్యను సృష్టించారని మిషన్ భగీరథ ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. శివంపేట మండలంలో చాలా రోజుల కింద నిర్మించిన ఓహెచ్‌ఎస్‌ఆర్కు కనెక్షన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన జెడ్పిటిసి గారి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆశాఖ అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. ఆ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత డి ఈ పై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు ఎమ్మెల్సీ తెలిపారు.

తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై విస్తృత స్థాయిలో సమీక్ష జరిగింది. మంజూరై పెండింగ్లో ఉన్న బీటీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని ఆ శాఖ ఈఈ కి ఎమ్మెల్సీ తెలిపారు. ఆ నిర్మాణంలో ఉన్న రోడ్లపై బ్రిడ్జిలు పూర్తి కాకపోవడానికి కాలువలో నీరు లీకేజీ కావడం సమస్యని ఎమ్మెల్సీకి పిఆర్ ఈఈ విన్నవించడంతో అక్కడే ఉన్న ఇరిగేషన్ ఈఈని కాలువలోకి నీరు లీకేజీ కాకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ ఆదేశించారు. 2016-17 సంవత్సరంలో మంజూరైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం పై అధికారులపై ఎమ్మెల్సీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ ద్వారా మంజూరైన నామినేట్ వరక్స్ కూడా పెండింగ్లో ఉండడం పై ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఆ పనులను పూర్తి చేసుకోవాలని అధికారులతో పేర్కొన్నారు.

హవేలి ఘనపూర్ , సికిండ్ల పూర్ గ్రామాలలో నిర్మించిన టూ బిహెచ్‌కె కాలనీల్లో మౌలిక వసతుల సమస్య ఉందని వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని పిఆర్ అధికారులకు ఎమ్మెల్సీ తెలిపారు. హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లి గ్రామంలో మన ఊరు మనబడి పథకం కింద మంజూరైన మూత్రశాలలు, కిచెన్ షెడ్ పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయని వాటిని త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు. తాను గతంలో శాసనమండలిలో మాట్లాడిన విధంగా అమ్మాయిలు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో మొదటి ఫేసులో మంజూరు కాకుండా ప్రాధాన్యతగా తీసుకొని ఆ సంబంధిత పాఠశాలల్లో టాయిలెట్లను నిర్మించాలని ఎమ్మెల్సీ అధికారులకు తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే తాను సంబంధిత శాఖ మంత్రితో కూడా మాట్లాడతారని ఎమ్మెల్సీ అన్నారు.

నిజాంపేట మండలంలో మన ఊరు మన బడి పథకంలో పని కాని వాటికి ఎప్టీఓలు జారీ చేశారని, పని అయిన వాటికి ఎఫ్టీఓలు మాత్రం జారీ చేయలేదని నిజాంపేట మండల జెడ్పిటిసి విజయ్ కుమార్ గారు ఆవేదన వ్యక్తం చేయడంతో ఎమ్మెల్సీ ఆ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమస్యను పరిష్కరించి వెంటనే ఆ ప్రోగ్రెస్ రిపోర్టును సంబంధిత జడ్పిటిసికి తెలపాలని వారికి సూచించారు. పనులకు సంబంధించిన పేమెంట్స్ ను త్వర త్వరగా రికార్డు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు పంపించడంలో పిఆర్ ఇంజనీరింగ్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అది సత్వరమే పరిష్కరించుకోకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఎంఎన్ కెనాల్ ఎఫ్ ఎన్ కెనాల్ లకు సంబంధించి షెట్టర్ల మరమ్మత్తులను లీకేజ్ లను త్వరగా రిపేరు చేసి అలర్ట్ గా ఉండాలని ఇరిగేషన్ శాఖ ఈఈ కి ఎమ్మెల్సీ సూచించారు.

గతంలో వర్షాకాల వర్షాకాలంలో ఇరిగేషన్ శాఖ అప్రమత్తంగా లేక చాలా చెరువులకు గండ్లు పడి పంట పొలాల మునిగి చెరువుల్లో నీరు సైతం వృధాగా పోయి నష్టం కలిగిందని ఆ విషయంలో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్సీ సూచించారు. హవేలీ ఘనపూర్ మండలంలోని ముత్తాయి కోట గ్రామానికి సంబంధించిన ఒక చెరువు వద్ద తాత్కాలిక వరదనీరు నిర్వహణకు తాత్కాలిక ఏర్పాటు మాత్రమే చేశారని వాటిని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ అధికారులకు తెలిపారు. రెండు కెనాల్ లకు సంబంధించిన లైనింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని తూప్రాన్ మండలంలోని యావపూర్ చెక్ డాం పనులు సైతం త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ అధికారులకు తెలిపారు.

కెనాల్ పనులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు సరైన ప్రతిపాదనలు పంపకపోవడంతో జిల్లాకు నష్టం జరిగిందని అధికారులపై ఎమ్మెల్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు. శివంపేట మండలంలో 2017 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న పని గురించి జెడ్పిటిసి గుర్తు చేయగా ఆ విషయంలో ఎమ్మెల్సీ ఆ శాఖ ఈ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కెనాల్ లకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రతిరోజు జరుగుతున్న వాహనాల రిజిస్ట్రేషన్ ల గురించిన సమాచారం జిల్లా రవాణా శాఖ అధికారులు సమావేశం ముందు ఉంచడంతో దాని గురించి ఎమ్మెల్సీ రవాణా శాఖ అధికారులను ఆరా తీశారు. అనంతరం రవాణా శాఖ అధికారులతో ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామ మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోడ్లపై ట్రాక్టర్లు కేజీ వీలులు వేసుకొని తిరగకుండా నియంత్రించాలని ఎమ్మెల్సీ అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జెడ్పీ చైర్‌పర్సన్‌లతోపాటు జెడ్పిటిసిలు, సంబంధిత శాఖల ఉన్నత అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News