Friday, April 4, 2025

తైక్వాండోలో భారత్‌కు పతకాల పంట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: థాయిలాండ్ వేదికగా జరిగిన కెడిఎం అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో భారత ఆటగాళ్ల పతకాల పంట పండించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో భారత్‌కు రికార్డు స్థాయిలో 36 పతకాలు లభించాయి. గ్రాండ్‌మాస్టర్ విజయ్ సోమ సారథ్యంలో భారత్ ఈ పోటీల్లో బరిలోకి దిగింది. కాగా, భారత్‌కు ఈ ఛాంపియన్‌షిప్‌లో ఏడు స్వర్ణాలు, పది రజతాలు, మరో 19 కాంస్య పతకాలు లభించాయి. వివిధ కేటగిరీల్లో జరిగిన పోటీల్లో భారత ఆటగాళ్లు అసాధారణ ప్రతిభను కనబరిచి పతకాల పంట పండించారు. ప్రిషా పాగే, రిషాన్ చంద్ర మొహంతి, రుహాన్ పార్మర్, సుబ్బారావు, అశ్వికా రాచకొండ, ప్రతిక్ పాగే తదితరులు స్వర్ణ పతకాలు సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News