Thursday, January 23, 2025

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో టిఎస్ ఆర్టీసి ఉద్యోగుల సత్తా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సౌత్ కొరియాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఆసియా -పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆర్చరీలో రెండు పతకాలను సాధించారు. జీడిమెట్ల డిపో కండక్టర్ ఎం.అంజలి ఆర్చరీ18 మీటర్ల విభాగంలో గోల్డ్‌మెడల్‌ను సాధించగా, కరీంనగర్ జోనల్ వర్క్‌షాప్ మెకానిక్ కె.కిషన్ 30 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్‌ను సాధించారు.

హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా మాస్టర్స్ గేమ్స్‌లో వీరు సత్తా చాటడంతో ఇంటర్నేషనల్ ఆసియా -పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. సౌత్ కొరియాలోని జియోన్బుక్‌లో ఈ నెల 12 నుంచి 20 వరకు ఈ పోటీలు జరిగాయి. వీరిద్దరి ప్రతిభను గుర్తించిన సంస్థ సౌత్ కొరియాకు వారిని పంపించడంతో వారు రెండు పతకాలు సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News