Sunday, January 19, 2025

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News