- Advertisement -
హైదరాబాద్: మేడారం జాతరకు గిరిజన కళలు, హస్త కళ బహుమతులతో ప్రత్యేక ఆహ్వానాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సిద్ధం చేస్తోంది. ములుగు జిల్లా మేడారంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కళాఖండాలతో ఆహ్వాన పత్రికను ముద్రింఆచరు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే జాతర రోజువారీ కార్యక్రమాలను పొందపర్చారు. ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులకు ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌తో ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా ఆహ్వానం పత్రికతో పాటు కాఫీ టేబుల్ బుక్, కోయా/ గోండు పెయింటింగ్స్, మాస్క్‌లు, బంజారా, ఓజా గోండు క్రాప్ట్స్, సమాచార స్టిక్కర్లు ఉన్నాయి. తెలంగాణ గిరిజనుల జీవనం, సంస్కృతికి చిత్రాలు అందులో ఉన్నాయి. కోయా,గోండు పెయింటింగ్‌లు ఉన్నాయి.
- Advertisement -