- Advertisement -
497 హుండీల్లోని నగదు, ఆభరణాల లెక్కింపు చేపట్టిన అధికారులు
హైదరాబాద్: మేడారం జాతర ఘనంగా ముగిసిన నేపథ్యంలోనే మేడారం మహాజాతర కానుకల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. హన్మకొండలోని తితిదే కల్యాణమండపంలో అర్చకులు, అధికారులు పూజలు చేసి హుండీలను తెరిచారు. మొత్తం 497 హుండీల్లో ఉన్న నగదు, ఆభరణాలు వేరు చేసి లెక్కిస్తున్నామని ఆలయ ఈఓ రాజేంద్రం తెలిపారు. ఈ ఏడాది ఆదాయం ఎక్కువ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంతంలో రద్దీ నెలకొంది. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర కన్నుల పండువగా జరిగిన నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
- Advertisement -