మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతల దర్శనానికి దర్శనానికి భక్తులు అధిక సం వచ్చిశనివారం దర్శించుకుంటున్నారు. రెండవ శనివారం సెలవు దినం కావడంతో ముందుగానే మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఫిబ్రవరి16 నుండి19వరకు మేడారం జాతర సమ్మక్క, సారలమ్మల జాతర జరుగనుండగా ముం దుగానే భక్తులు మేడారం తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమీపిస్తుండటంతో ఇంకా అభివృద్ధి పనులు పూర్తి కాకుండా ఉన్నా అసౌకర్యాలతోనే భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పస్రా నుండి మేడారం వచ్చే రోడ్డు ప్రమాదకరంగా ఉ న్నా భక్తులు నానా ఇబ్బందులు పడుకుంటూ వచ్చి అసౌకర్యాల నడుమ వనదేవతలను దర్శించుకుంటున్నారు. వనదేవతల దర్శనార్ధం వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, బాతింగ్ ఘూట్లు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
మేడారంలో భక్తుల కోలాహలం
- Advertisement -
- Advertisement -
- Advertisement -