Sunday, December 22, 2024

మేడారం మహాజాతర హుండీల లక్కింపు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మేడారం మహాజాతర హుండీల లక్కింపు ప్రారంభమైంది. గురువారం హనుమకొండలోరి తితిదే కల్యాణ మండపంలో హుండీల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. మొత్తం 518 హుండీలను 10 రోజులపాటు లెక్కించనున్నారు. కాగా, మేడారం హుండీల లెక్కింపులో నలికీ నోట్లు బయటపడుతున్నాయి. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను పలువురు భక్తులు హుండిలలో వేశారు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్ ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెరిచిన హుండీలలోఆరు నకిలీ నోట్లు కనిపించినట్లు అధికారులు తెలిపారు.

కాగా ఈనె 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మేడారం మహాజాతర వైభవంగా జరిగింది. దాదాపు కోటి 40 లక్షల మంది భక్తులు మేడారం జాతరను సందర్శించి సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News