Tuesday, December 24, 2024

మేడారం పూజారి హత్య…

- Advertisement -
- Advertisement -

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద ఓ వ్యక్తిని హత్య చేశారు. రవి(40) అనే వ్యక్తిని బండరాయితో దుండగులు కొట్టి చంపారు. మృతుడు మేడారం గోవిందరాజు గద్దెల పూజారి దెబ్బకట్ల రవిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్త ములుగు ఆస్పత్రికి తరలించారు. రవి హత్య వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాత పగల నేపథ్యంలో దగ్గరి బంధువులే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. దీంతో మేడారంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News