Sunday, January 19, 2025

ఫంక్షన్ పేరుతో బయటకు తీసుకెళ్లి… భార్యను చంపి… కనిపించడంలేదని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్యను పంక్షన్ ఉందని బయటకు తీసుకెళ్లి రాయితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసిన సంఘటన మేడ్చల్ జిల్లా బౌరంపేట శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లా బోధన్ చెంది రాజేశ్(45), అదే మండలానికి చెందిన రాజేశ్వరి(38)తో 2005లో పెళ్లి జరిగింది. రాజేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మియాపూర్‌లో ఉంటూ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వివాదాలు తారాస్థాయికి చేరుకోవడంతో గండిమైసమ్మ వద్ద ఫంక్షన్ ఉందని బైక్‌పై భార్యను భర్త తీసుకెళ్లాడు. బౌరంపేటలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి రాయితో ఆమె తలపై బాదాడు. మృతదేహాన్ని అక్కడే ఉన్న కాలువలో పడేశాడు. తన భార్య కనిపించడంతో అత్తింటివారికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News