- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం టివిఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు భార్య, భర్త, కూతురుగా గుర్తించారు. బాలుడి రెండు కాళ్లపై నుంచి లారీ వెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -