Wednesday, January 22, 2025

రైతుల రుణమాఫీపై కెటిఆర్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఘట్కేసర్ లో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ విజయోత్సవ సభ నిర్వహించింది. సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర హక్కులు సాధించాలంటే ఎంపి ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలవాలని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 450 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గెలిచిందన్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు… రెండు నెలలు గడుస్తున్నా.. రైతుల రుణమాఫీ జరగలేదెందుకని..? ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెబుతున్నారని వెల్లడించారు. ఉచిత బస్సుల వల్ల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలిసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారని కెటిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News