Monday, December 23, 2024

ఈటలతో మేడ్చల్ డిసిపి భేటీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని, హత్యకు కుట పన్నుతున్నారంటూ ఈటల రాజేందర్ భార్య జమున చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ ఆదేశాల మేరకు మేడ్చల్ డిసిపి సందీప్ రావు ఈటలను కలిశారు. గురువారం ఉదయం భద్రత అంశంపై ఈటల స్వగృహంలో డిసిపి సందీప్‌రావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన హత్యకు కుట్ర జరుగుతోందనీ,

తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే ఈటల రాజేందర్ తెలపడం జరిగింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రత కల్పిస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఈటల రాజేందర్ మేడ్చల్ డీసీపీతో చర్చించిన అనంతరం నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థని అడిగి తెలుసుకోమని సూచించారు. కరీంనగర్ సిపి దగ్గర సమగ్ర సమాచారం తెలుసుకోమని తెలిపారు. అక్కడి సమాచారం మీద ఆధారపడి భద్రతపై నిర్ణయాలు తీసుకోమని పేర్కొన్నారు. నిజ నిజాలను తెలుసుకున్న తర్వాతే భద్రతపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News