Friday, December 20, 2024

మియాపూర్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మియాపూర్ లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మియాపూర్ నుండి కూకట్ పల్లికి వెళ్ళే ప్రధాన రహదారి పిల్లర్ నంబర్ 622 వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లడంతో వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. సిసిటివి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మియాపూర్ పోలీసులు  హిట్ అండ్ రన్ గా కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News