Monday, January 20, 2025

బాచుపల్లిలో భోజనం బాగోలేదని భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. భోజనం బాగోలేదని భార్యను భర్త కొట్టిం చంపాడు. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలోని ప్రగతి బిల్డింగ్ వద్ద మధ్య ప్రదేశ్ కు చెందిన భార్య భర్తలు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వంట బాగోలేదని భార్య రవినాదూబే(26)ని భర్త ఇటుకతో కొట్టాడు. తలకు బలమైన గాయాలు కావడంతో భార్య ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News