Friday, December 27, 2024

మేడ్చల్ జిల్లా విద్యా శాఖ అధికారికి జాతీయ ఇన్నోవేషన్ అవార్డు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: జిల్లా విద్యా శాఖ అధికారి ఐ.విజయకుమారి విద్యా శాఖ విభాగంలో జాతీయ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్నారు. కేంద్ర విద్యా శాఖ ఎన్‌సిఇఆర్‌టి/ఎన్‌ఐఇపిఎ ద్వారా ఏటా జాతీయ ఇన్నోవేషన్ అవార్డులను అందజేస్తుంది. విద్యా శాఖ విభాగంలో అందజేసే అవార్డు కోసం వచ్చిన నామినేషన్లను పరిశీలించిన నిపుణుల కమిటీ, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఉపాధ్యాయుల ద్వారా వీడియో పాఠ్యాంశాలను రూపొందించి www.medchalbadi.comలో అందుబాటులో ఉంచినందుకు గాను మేడ్చల్ జిల్లా విద్యాశాఖను ఇన్నోవేషన్ అవార్డుకు ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన జాతీయ ఇన్నోవేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుగా జిల్లా విద్యా శాఖ అధికారి విజయ కుమారి పురస్కారం అందుకున్నారు.

ఈ మేరకు శుక్రవారం ఎస్‌టియుటిఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎస్.శివాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.ప్రేమ్‌కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు విద్యా శాఖ అధికారిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా శాఖ అధికారి విజయకుమారి మాట్లాడుతూ సమిష్టి కృషితో జిల్లా విద్యాశాఖకు ఇన్నోవేషన్ అవార్డు దక్కిందని అన్నారు. మేడ్చల్ బడి.కామ్ నిర్మాణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, విజయవంతం చేసిన విద్యార్ధుల తల్లిదండ్రులకు, వెబ్‌సైట్ నిర్మాణానికి సహకరించిన స్పూర్తి ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News