Monday, December 23, 2024

జీడిమెట్లలో అర్ధ రాత్రి క్యాబ్ పై ఆకతాయిల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బుధవారం అర్ధ రాత్రి సాఫ్ట్ వేర్ ఉద్యోగులను క్యాబ్ లో వెళ్తుండగా ఐదుగురు ఆకతాయిలు వారిని అడ్డగించారు. అనంతరం క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి నగదు లాక్కున్న సంఘటన మల్కాజ్ గిరి మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను అనిల్ (24) అనే డ్రైవర్ తన స్విఫ్ట్ డిజైర్ కార్ లో మాదాపూర్ నుండి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రునగర్ లో డ్రాప్ చేయడానికి అర్థ రాత్రి 2.30 కు వస్తుండగా నెహ్రు నగర్ రోడ్డుపై మున్న, రాజాసింగ్, అఖిల్ తో పాటు మరో ఇద్దరు మొత్తం ఐదుగురు ఆకతాయిలు మద్యంమత్తులో క్యాబ్ ను అడ్డగించారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వద్ద డబ్బులు, సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ అనిల్ మెడపై బ్లేడ్ తో గాయపరిచారు. స్థానికులు అనిల్ ను స్థానిక లైఫ్ స్పాన్ ఆసుపత్రికి తరలించారు. అర్థ రాత్రి తాగుబోతులతో తమకు రక్షణ లేదని, దాడులు ఎక్కువ అవుతున్నాయని క్యాబ్ డ్రైవర్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News