Wednesday, January 29, 2025

ఉప్పల్‌లో ప్రియురాలిని కారుతో ఢీకొట్టి చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ప్రియురాలును ప్రియుడు కారుతో ఢీకొట్టి చంపేసిన సంఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామంతాపూర్‌కు చెందిన పెన్నాం చంద్రమౌళి అనే వ్యక్తి ఎస్‌ఎన్‌ఎస్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఉప్పల్‌లో నాగోల్ మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఎఎస్‌ఎన్‌ఎస్ రియల్ ఎస్టేట్‌ను నిర్వహిస్తున్నాడు. ఆయన ఆఫీసులో కొమ్మవారి మంజుల జాబ్ చేస్తోంది. ఆమెతో అతడు గత మూడు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కొనిసాగిస్తున్నాడు. మంజుల మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో ఆమెపై చంద్రమౌళి అనుమానం పెంచుకోవడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఆమె గతంలో చంద్రమౌళి వద్ద నుంచి రూ.28 లక్షల తీసుకుంది. డబ్బులు ఇవ్వాలని పలుమార్లు ఆమెను అడిగిన ఇవ్వకపోవడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఆమెను ఉప్పల్ భగయత్‌కు తీసుకవచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆమెను కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. అనంతరం ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News