Wednesday, January 22, 2025

ఉప్పల్‌లో ప్రియురాలు ముందే ఉరేసుకున్న ప్రియుడు

- Advertisement -
- Advertisement -

ఉప్పల్: లాడ్జ్‌లో ప్రియురాలు ముందే ప్రియుడు ఆమె చున్నీతో ఉరేసుకున్న ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బోరబండకు చెందిన ఓంకార్(29) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఓంకార్ తన ప్రియురాలుతో కలిసి రామంతాపూర్‌లోని ఓయో హోటల్‌కు వచ్చాడు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తన ప్రియురాలి చున్నీ తీసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రియురాలు వెంటనే స్పందించి ఓయో సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వెంటనే ఓయో సిబ్బంది రూమ్‌కు చేరుకొని మెడ నుంచి చున్నీని వేరు చేసి ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News