Monday, January 20, 2025

అద్దె ఇంట్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేషర్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ప్రిన్సటన్ కాలేజీలో నివాస్(19) అనే యువకుడు బీ ఫార్మసీ చదువుతున్నాడు. గోరుగుల సాయి గణేష్ (21) నారపల్లిలోని ఎంజెఆర్ మాల్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరికి అనుకోకుండా పరిచయం కావడంతో ఒక రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం నివాస్ ప్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. సాయి గణేష్ బాత్రూమ్‌లో విషం తాగి మృతి చెందాడు.

యజమాని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నివాస్ స్వస్థలం మేడ్చల్ జిల్లా ఘన్‌పూర్, సాయి గణేష్ స్వస్థలం కొత్తగూడెంలోని కోరుకొండ గ్రామానికి చెందిన వాడు. అమ్మా నాన్న తనని క్షమించాలని తనకు చెడుఅలవాట్లు ఉన్నాయని సూసైడ్ లేఖలో నివాస్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News