Thursday, January 9, 2025

బ్లాక్ మెయిల్ తో ప్రేమజంట ఆత్మహత్య… బాలిక మృతదేహంతో బంధువుల ధర్నా

- Advertisement -
- Advertisement -

కారులో ప్రేమ జంట ఆత్మాహుతి కేసు
బాలిక మృతదేహంతో
బంధువుల ధర్నా
మన తెలంగాణ/ఘట్‌కేసర్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్ పరిధిలో సోమవారం కారులో ప్రేమ జంట ఆత్మహత్యకు కారణమైన యువకుడి ఇంటి ముందు బాలిక నిఖిత మృతదేహంతో మంగళవారం కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ సర్వీస్ రోడ్డులో ప్రేమికులు శ్రీరాం, నిఖిత కారులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ చావుకు పోచారం మున్సిపల్ పరిధి మక్తా గ్రామానికి చెందిన ముంత మహేష్ యాదవ్ (చింటు) వేధింపులే కారణమని పోలీసు దర్యాప్తులో తేలడంతో మంగళవారం గాంధీ ఆస్పత్రిలో నిఖిత మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మక్తాలోని చింటు ఇంటి ముందు దహన సంస్కారాలు నిర్వహించే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

పోలీసులు నిఖిత కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ చింటూను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగేవారకు ఇక్కడి నుండి కదిలేది లేదని, చితి పేర్చిడంతో పోలీసులు అందరినీ అక్కడి నుండి చెదరగొట్టారు. తమకు న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు ఏ తల్లిదండ్రులకు ఎదురుకావద్దని బాధిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎట్టకేలకు భారీ పోలీసు బందోబస్తు మధ్య నిఖిత అంతిమ యాత్ర కొనసాగింది. ప్రేమ జంట కారులో సజీవ దహనానికి కారణమైన ముంత మహేష్ యాదవ్ (చింటు) పరారీలో ఉండడంతో..ఈ వేధింపులలో ఎవరెవరి పాత్ర ఉంది అనే దానిపై చింటూ మిత్రులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News