Tuesday, December 24, 2024

ఘట్‌కేసర్‌లో మర్మాంగాలపై కారం చల్లి….. అతి దారుణంగా చంపేశారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన కుమార్తెను ప్రేమించాడని నిమ్న సామాజిక వర్గానికి చెందిన యువకుడిని చితక బాది, మర్మాంగాలపై కారం చల్లి చంపేసిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అన్నోజిగూడలో కరుణ్ నాయక్(18) అనే యువకుడు తన తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కరుణ్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అదే గ్రామంలో ఉండే బాలికతో(15) ప్రేమలో పడ్డాడు. ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు బంధువుల ఇంట్లో వేడుక ఉండడంతో వెళ్లిపోవడంతో బాలిక ఇంటికి కరుణ్ చేరుకున్నాడు. రాత్రి సమయంలో ఇంట్లోకి రావడంతో బాలిక కుటుంబ సభ్యులకు పక్కింటి వారు సమాచారం ఇచ్చారు. డోర్‌కు బయట వైపున లాక్ చేయడంతో యువకుడు ఇంట్లోనే ఉండిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని యువకుడిపై దాడి చేశారు. చేతులు, కాళ్లను కట్టేసి మర్మాంగాలపై దాడి చేయడంతో పాటు కారం పొడి చల్లి చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News