Sunday, December 22, 2024

భార్యను బెదిరించబోయి… ఉరేసుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చనిపోతానని భార్యను బెదిరించి భర్త ఉరేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు అనే కార్మికుడు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకొని రెండో వివాహం చేసుకున్నాడు. నాగరాజు మద్యానికి బానిస కావడంతో తరచూ ఆమె వేధింపులకు గురి చేస్తున్నాడు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. 6న మద్యం పూటుగా తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు బెదిరించాడు. ఇవాళ కూడా అలానే అని ఉంటాడని ఆమె అక్కడి నుంచి తన పిల్లలతో కలిసి దమ్మాయిగూడలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. 8వ తేదీ ఉదయం ఇంటికి వచ్చి చూడగా భర్త ఉరేసుకున్నట్టు గుర్తించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News