Monday, December 23, 2024

అసహజ శృంగారం చేయనివ్వలేదని హత్య

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: అసహజ శృంగారం చేయనివ్వలేదని ఓ వ్యక్తిని స్వలింగ సంపర్కుడు మద్యం సీసాతో దాడి చేసి చంపేసిన సంఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్‌కు చెందిన రమరేశ్ రామ్(45) జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జీడిమెట్లలోని రామ్‌రెడ్డి నగర్‌లో ఉంటూ కూలీ పనులకు వెళ్తున్నాడు. ఈ నెల 27న బ్యాంకు ఖాతా తెరిచేందుకు షాపూర్‌నగర్ వెళ్లాడు. తరువాత మద్యం షాపుకు వెళ్లి పూటుగా మద్యం తాగి వస్తుండగా రోడ్డుపై పడుకున్నాడు.

మత్తు దిగిన తరువాత షాపూర్‌నగర్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు. దారి తెలియక పోవడంతో అప్పుడే యుపికి చెందిన శివపూజన్(26) తారసపడ్డాడు. తాను తీసుకెళ్తానని రామ్‌ను శివ నమ్మించాడు. హెచ్‌ఎంటిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన తరువాత ఇద్దరు కలిసి మద్యం తాగారు. మత్తులో జోగుతున్న శివ కామవాంఛ తీర్చాలని రామ్‌ను బలవంతం చేశాడు. రామ్ నిరాకరించడంతో మద్యం బాటిల్‌తో రామ్‌పై శివ దాడి చేసి పారిపోయాడు. పోలీసులు గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో కేసు నమోదు చేసి విచారణ చేశారు. సిసి టివి ఫూటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో స్వలింగ్ సంపర్కుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News